అది మురికి నీరు పారే ప్రాంతం కాదు… ఒకప్పుడు హైదరాబాద్ మహానగరానికి త్రాగు నీరు సరఫరా చేసిన మూసి నది పరివాహక ప్రాంతం. చారిత్రక మూసినది నేడు మురికి కాలువగా మారిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ…ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం ప్రతిచోట బహిర్గతం అవుతూనే ఉంది. దీనికి ప్రత్యేక నిదర్శనమే మనం ఇప్పుడు చూస్తున్న మూసి మురికి కాలువ దృశ్శ్యాలు….
మూసి వరివాహక ప్రాంతాల్లో మనం ఇంట్లో, పెద్ద పెద్ద హోటల్స్ లలో వాడి పాడేసిన నూనె డబ్బాలను శుభ్రం చేసి వాటికి పెద్ద కంపెనీల స్టిక్కర్లను అంటించి, పేరుపొందిన షాపింగ్ మాల్స్ లలో ఉంచి…టీవీల్లో ప్రకటనలకు లక్షల్లో ఖర్చు చేస్తూన్నాయి…తమ కంపనీలలో తయారు చేసేది రిఫైన్డ్ ఆయిల్, కొలెస్ట్రాల్ రహిత నూనె…మీ ఒంటికి, మీ వంటకి మంచిదని చెప్తూ…ప్రముఖ టీవీ, సినిమా యాక్టర్లతో నానా హంగామా చేస్తున్నారు. వందలు, వేలు వీటిపై ఖర్చు చేస్తూ ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. ఆయా కార్పొరేట్ కంపెనీలు విసిరేకాసులకు అలవాటు పడుతున్న ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు తమ కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా… నిద్ర నటిస్తూ జగన్నాటకానికి తెరలేపుతున్నారు.
గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్, ఫార్చ్యూన్, సన్ డ్రాప్, సన్ ఫ్లవర్ తదితర ఖరీదైన నూనె తయారు చేసే కంపెనీలు 18 కిలోలు లేక 15 కిలోల స్టీల్ డబ్బాలలో క్రయవిక్రయాలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం…కానీ దాని వెనుక దాగున్న చీకటి కోణాన్ని పరిశీలిస్తే అసలు ఏ కంపనీని నమ్మే పరిస్థితి లేదు. వాస్తవానికి ఒకసారి వాడిన స్టెయిన్లెస్ స్టీల్ టిన్ ఆయిల్ డబ్బాను మరొక సారి వాడకూడదు. వివిధ పదార్ధాలతో తయారు చేసిన వంటనూనేకు సంబందించిన వ్యర్ధాలు, చర్మం, కొవ్వు ఆయిల్ డబ్బా టిన్ల లోపలి భాగానికి అంటుకుపోయి ఉంటుంది. ఒకసారి ఉపయోగించిన డబ్బాను మరోసారి ఉపయోగించటం ద్వారా ఆ కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి హానికరంగా తయారవుతాయి. ఈ డబ్బాలను శుభ్రం చెయ్యడానికి సైతం మంచి నీరు ఉపయోగించకుండా… మూసి నది నుంచి ప్రవహిస్తున్న మురికి నీటితో శుభ్రం చెయ్యడం మరింత అనారోగ్యానికి దారితీస్తోంది.
మూసి పరివాహక ప్రాంతాల్లో ఉంటూ… మురికి నీటితో, మూసి నుంచి వచ్చే దుర్గంధంతో ఆరోగ్యాలు సైతం పాడవుతున్నాయని, చాలా సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నామని, ఒక రోజు పనికి మూడువందల నుంచి మూడువందల యాభై రూపాయల కూలి లభిస్తోందని… ఏళ్ళ తరబడి పనిచేస్తున్నా తమ బ్రతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని, పని భారం పెరిగినా కూలి మాత్రం పెరగట్లేదని… ప్రభుత్వాలు మారినా…తమ బ్రతుకులు మారట్లేదని…లక్ష్మి బాయి, కవిత అనే మహిళలు ఫోర్ సైడ్స్ టీవీతో చెప్పారు. తమ పిల్లల చదువులకు, బ్రతుకుదెరువుకు, ఇంటి స్థలాలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని అనుకున్నా…ఆచరణ సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Discussion about this post