అమెరికన్ ప్రజలు ట్రంప్ వైపు ఉన్నట్లు ఓట్లను బట్టి తెలుస్తున్నప్పటికీ.. కోర్టులు మాత్రం న్యాయవిచారణలో శీఘ్రంగా, ఖచ్చితత్వంతో వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగానే జ్యూరీ హాష్ మని డీల్ అంటే సీక్రెట్ ను బయటకు పొక్కకుండా ఉండేదు ఇచ్చే నగదును గురించి ట్రంప్- కోహెన్ ల రికార్డు సంభాషణను వింది. దాని గురించి తెలుసుకుందాం..
2016లో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ఒక యువతితో అక్రమసంబంధం కలిగి ఉండటం బయటికి రాకుండా ఉండటం కోసం ఒక play boy కి కొంత సొమ్మును ముట్ట చెప్పినట్లు ఆ ఆడియోలో తెలుస్తోంది. కోర్టు రూంలో ఆ ఆడియో ప్లే చేయగానే రెండు గొంతులు ప్రతిధ్వనించాయి. మైఖేల్ కోహెన్ – డోనాల్డ్ ట్రంప్ వాయిస్ గా వాటిని గుర్తించారు. ఒక గొంతు మొదట బిగ్గరగా తర్వాత నెమ్మదిగా రాగ.. రెండో వాయిస్ సాధారణంగా ఉంది. మొదటి గొంతు డోనాల్డ్ జె. ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ డి కోహెన్ ది కాగ, రెండవ గొంతు ట్రంప్ నదిగా జ్యూరీ గుర్తించింది. మైఖేల్ డి. కోహెన్ సీక్రెట్ గా రికార్డు చేసిన ఈ లావాదేవీల సంభాషణను మన్ హట్టన్ జిల్లా అటార్నీ ఆఫీసులో న్యాయమూర్తులు విన్నారు. ఈ వాయిస్ రికార్డుపై రెండు వారాలపాటు విచారణ జరిగింది.
గత ఎన్నికలకు రెండు నెలల ముందు మాజీ ప్లే బాయ్, మోడల్ కరేన్ మెక్ డౌగల్ కు ఇవ్వాల్సిన నగదు లావాదేవీల గురించి కోహెన్ , ట్రంప్ మాట్లాడుకున్నారు. ఫైనాన్సింగ్ పరిస్థితి ఏమిటి అని ట్రంప్ అడగడం.. నగదురూపంలో చెల్లించండి అని కోహెన్ కు ట్రంప్ డైరెక్షన్ ఇవ్వడం లాంటివి జరిగాయి. ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ విజయం సాధించడానికి ఏమేరకు కుట్రలు జరపగలుగుతారో న్యాయమూర్తులు తెలుసుకుంటున్నారు. లాస్ ఏంజెల్స్ లో గొప్పవారి స్కాండల్స్ లో వాదించి పేరుతెచ్చుకున్న న్యాయవాది కీత్ డేవిడ్ సన్ ట్రంప్ నకు కూడా లాయర్ గా వ్యవహరించడంతో ఆయనను ప్రాసిక్యూటర్లు ప్రశ్నించి మరింత సమాచారాన్ని రాబట్టారు.
Discussion about this post