కూటమి అభ్యర్ధిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వరుపుల సత్యప్రభ రాజా జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సూపర్ సిక్స్ పధకాలను ప్రజలకు వివరస్తున్నారు. వైసీపీ పార్టీ నుండి రాజా సమక్షంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ఆమె 4సైడ్స్ టీవితో మాట్లాడుతూ… ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రజలు స్వర్గీయ రాజన్న పరిపాలన చూడాలని ఎదురుచూస్తున్నారని, ఆయన తమ మధ్య లేకున్నా ప్రతి గ్రామంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. ప్రజలు పెట్టుకున్న ఆశలతో పాటు, సంక్షేమ పధకాలను ప్రతి గడప గడపకు చేరవేస్తానని చెప్పారు.
Discussion about this post