ప్రపంచ దేశాల్లో ప్రతి దేశానికి ఒక కోడ్ ఉంటుంది… ఇది అందరికీ తెలిసిన విషయమే.. ఇక మనదేశానికి +91తో కోడ్ ఉంది. అసలు ఈ కోడ్ కేటాయించడానికి గల కారణమేంటి..? ఈ కోడ్ ను ఎవరు కేటాయిస్తారు..దేని ఆధారంగా ఆ నంబర్ కేటాయిస్తారు. దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ఆ వివరాలు మీ కోసం..
స్పాట్
ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ టెలికమ్యూనికేషన్ యూనిట్ ఈ నంబర్ ను కేటాయిస్తుంది. ఒక్కో దేశానికి ఒక్కో నంబర్ ను కేటాయిస్తుంది. ఏ దేశానికి చెందిన స్థానిక నంబర్ కు ఫోన్ చేయాలన్నా ఆ దేశానికి చెందిన కంట్రీ కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ జాబితాను ఐటీయూకు చెందిన కన్సల్టేటివ్ కమిటీ తయారు చేసింది. జనాభా, ఆర్థిక వ్యవస్థ, కమ్యూనికేషన్ సంబంధిత అంశాల ఆధారంగా ఈ కోడ్లను కేటాయిస్తారు. తొమ్మిదో జోన్ కిందకు దక్షిణ, మధ్య, పశ్చిమాసియాతో పాటు మధ్య ప్రాచ్య దేశాలు ఉన్నాయి. ఈ కోడ్ లో ఉన్న అన్ని దేశాల కోడ్ 9 తో ప్రారంభం అవుతుంది. భారత్ కు +91, పాకిస్థాన్ కు +92, ఆఫ్గానిస్తాన్ కు +93 కేటాయించారు. ప్రముఖ, అత్యంత జనాభా కలిగిన దేశాలకు తక్కువ డిజిట్ కలిగిన కోడ్ ఉంటుంది.. చిన్న దేశాలకు మూడు అంకెల కోడ్ ఉంటుంది. US కు (+1), USSR కు(+7)కు మాత్రమే సింgle డిజిట్ కోడ్ లు ఉన్నాయి. బంగ్లాదేశ్ (+880), ఫిజీ (+679), కాంగో వంటి చిన్న దేశాలకు మూడంకెల కోడ్ ఉంటుంది.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post