ఐపీఎల్ సీజను చాలా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. ఇక తాజాగా రన్ మెషిన్ విరాట్కోహ్లీకి సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నంబర్ 18ను జెర్సీగా ధరిస్తాడు విరాట్… ఇక ఈ నంబర్ ఉన్న తేదీల్లో ఆయనకు కలిసొచ్చే రోజు.. చెన్నై, బెంగళూరు మధ్య చివరి మ్యాచ్ జరుగుతుంది… ఇందులో విరాట్ సెంటిమెంట్ నంబర్ 18నే జరుగుతుంది మ్యాచ్. ఈ నంబర్‌పై ఇప్పుడు ఫుల్‌గా టాక్ నడుస్తోంది… దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం..
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే మూడు జట్లు కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ చేరాయి. టాప్ 4లో నిలిచే నాలుగో జట్టుపైనే అందరి దృష్టి ఉంది. అయితే.. ఆ అవకాశం రెండు జట్లకు మాత్రమే ఉంది. చెన్నై, బెంగళూరు మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ ఆ నాలుగో జట్టును తేల్చనుంది. ఈ మ్యాచ్ జరిగేది మే ‘18’న కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినా.. ఫ్లేఆఫ్స్ చేరడానికి చాలా సమీకరణాలు ఉన్నాయి.
ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే ‘18’ పరుగుల తేడాతో గెలవాలి. రెండోసారి ఆడితే ‘18’.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. అప్పుడే కోహ్లీ జట్టు టాప్ 4లోకి చేరుతుంది.
2013 నుంచి ఐపీఎల్లో బెంగళూరు మే ‘18’ నాడు ఆడిన వాటిల్లో ఇప్పటివరకూ అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. ఇక మే 18నే విరాట్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు కూడా. ఈ తేదీనే రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ బాదాడు.
మే 18న బెంగళూరు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండుసార్లు చెన్నైని ఢీకొంది. ఈ రెండు మ్యాచుల్లో బెంగళూరే విక్టరీ కొట్టింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ బ్యాటింగ్ పర్ఫామెన్స్ చేశారు. మరోసారి మే 18నే తాజా మ్యాచ్ జరుగుతుండటం.. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా విరాట్ ఇరగదీస్తాడని ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు… నిజంగా విరాట్‌కు గతంలో 18 చాలా కలిసి వచ్చింది.. ఈ సారి కూడా కలిసి వస్తుందేమో చూద్దాం…
Discussion about this post