2014లో రాష్ట్ర విభజన అంశంతో పాటు, కాంగ్రెస్పార్టీపైన పెరిగిన వ్యతిరేకత అప్పట్లో భారీ పోలింగుకు బీజం వేసింది. రాష్ట్ర పునర్నిర్మాణం, ఐటీ విజనరీ చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మిన ప్రజలు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు… అమరావతికి రాజధానిగా పునాదులు పడ్డాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ప్రకటించిన హామీలు వైఎస్సార్సీపీ విజయానికి దోహదం చేశాయి. గత ఐదేళ్లలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల మద్దతు ఉన్నా… అవి ఓట్లుగా మారాయా? అనే అంశం చర్చకు వస్తోంది. విశాఖను రాష్ట్ర రాజధానిగా చేస్తామన్నప్పటికి… ఉత్తరాంధ్ర ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపించిందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నగర నిర్మాణాలు కాస్త మైనస్ పాయింట్లుగా… విద్యుత్బిల్లులు, చెత్త పన్నులు, పెరిగిన ఆర్టీసీ చార్జీలు ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెప్తున్నాయి. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు హామీ, పోలవరం కట్టిస్తామన్న మోదీ మాటలపై విశ్వాసం, ఇరు పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడంలో జనసేనాని పవన్ కల్యాణ్ చొరవ కూటమిపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని, కూటమి ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుని వెళ్లాయని… అవి కాస్తా ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Ratan Tata: The Visionary Behind India’s Transformation
Ratan Tata: జాతీయ చిహ్నానికి నివాళి Ratan Tata, భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్, తన జీవితాన్ని సమాజానికి సేవ...
Discussion about this post