ఏపీలో ఓటింగ్ జరిగినప్పటి నుంచి గెలుపు ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . కావలి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీలో ఉన్నారు. కావలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కఠ నెలకొంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరి…
కావలి నియోజవర్గం కలికి యానాది రెడ్డి హయంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఆయన హస్తం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ మృతితో కాంగ్రెస్ కార్యకర్తలంతా వైసీపీకి మారారు. వైసీపీ నుంచి పోటీ చేసి రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి గెలిచారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ఆయనకే టికెట్ దక్కింది. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కృష్ణారెడ్డి సైతం వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ సీటు ఇవ్వకపోవడంతో సొంతగూటికి చేరుకుని కూటమి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. స్థిరాస్థి వ్యాపారాలు, కాంట్రాక్టుల, మైనింగ్ చేసి ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నారు. సిటింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి కి గట్టి పోటీ ఇస్తూ విజయం సాధించేందుకు కృష్ణారెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండు దఫాలుగా కావలి నుంచి ప్రాతినిథ్యం వహించినప్పటికీ పూర్తిస్థాయిలో పట్టు సాధించలేక పోయారు. మితిమీరిన ఆత్మవిశ్వాన్ని కనపరిచే రామిరెడ్డి ప్రజల మనస్సులలో విస్తృతమైన స్థానాన్ని సాధించలేక పోయారు. ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలో అసమ్మతి వర్గాలను పెంచిపోషించారన్న విమర్శలున్నాయి. మీడియాను కూడా విభజించి ప్రభావితం చేశారన్న అపప్రదను మూటకట్టుకొన్నారు. జగనన్న పథకాలు తనకు శ్రీరామరక్ష , క్షేత్రస్థాయిలో వాలంటీరు వ్యవస్థ తనకు వెన్నదన్నని చాలాసందర్భాలలో విశ్వాసాన్ని కనపరిచారు. వైసీపీ ప్రభంజనం తనను మరోసారి అసెంబ్లీకి పంపుతుందని, హ్యట్రిక్ విజయం తన సొంతమని నిబ్బరంగా ఉన్నారు.
పునర్విభజనలో అ్లలూరు నియోజకవర్గం అధిక భాగం కావలిలో అంతర్బాగమైంది. ఎన్నికలలో సాలీడ్ ఓట్లను అందించే జాలరి పాళెం రాజకీయం ఒక వైపు, మెట్ట – మాగాణి మిళితంగా ఉన్న దగదర్తి, బోగోలు మండలాలు మరో వైపు ఉన్నాయి. పట్టణ ప్రాంతంలో కలిసిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆలవాలమైన కావలి రూరల్, ముసునూరు ప్రాంతాలు ఎన్నికల రాజకీయంలో కీలకమయ్యయి. అల్లూరు మండలం కాస్త వైసీపీకి అనుకూలమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. బోగోలు మండలంలో విజయావకాశాలు సమానమన్న సంకేతాలు వెలుడుతోన్నాయి. కావలి, రూరల్ మండలాలు కలుపుకొని టీడీపీ దే పైచేయిగా చర్చలు ఊపందుకొన్నాయి.
Discussion about this post