డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షన్నర వరకు సొమ్ములు తీసుకుని కంబోడియాకు తీసుకెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయం తో విశాఖకు తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ వెల్లడించారు. బాధితులు ఇంటికి చేరుకోవడానికి పోలీసు శాఖ పని చేస్తోందని తెలిపారు. అక్కడ వాళ్ళు వీరిని చైనా వారికి అప్పగించారని… వీరి ద్వారా ఇండియాలో సైబర్ క్రైముకు పాల్పడేలా చేశారని చెప్పారు. ఒక్క సైబర్ క్రైమ్ ద్వారా విశాఖలో 120 కోట్లు పోయాయని, నిన్న ఒకరోజే 3.20 కోట్లు దోచేశారని అన్నారు. 20 మందితో 7 బృందాలు ఏర్పాటు చేసి, అన్ని ఆంశాల మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. మన రాష్ట్రం నుంచి 150 పైగా బాదితులు లెక్క తేలింది. కంబోడియా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పని చేసాయని, ఈ తరహా బాధితులు ఇంకా ఎవ్వరైనా ఉన్నారా అని విచారణ జరుపుతున్నాము.
Discussion about this post