గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర కుమార్ రామ్‌ను…10వేల లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడి వెనుక ఓ అవినీతి కొండే ఉందని నాడు దర్యాప్తు అధికారులు ఊహించివుండరు..! వీరేంద్రను విచారించగా ఈ హవాలా నెట్వర్క్ బయటపడింది. దర్యాప్తులో అతడు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లకు టెండర్ల ఆశ జూపి వారి నుంచి భారీ మొత్తంగా డబ్బులు దండుకున్నట్లు వీరేంద్ర విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇందులో తనతో పాటు చాలా మంది పెద్ద స్థాయి అధికారులు కూడా భాగస్వాములైనట్లు చెప్పాడు. మొత్తం టెండర్ విలువలో 3.2 శాతం కమిషన్ తీసుకోగా.. అందులో తన వాటా 0.3శాతమని వీరేంద్ర పేర్కొన్నాడు. అతడు ఇచ్చిన వాంగ్మూలంతో ఈడీ విస్తృత దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలంపై నిఘా పెట్టి పలు చోట్ల సోదాలు నిర్వహించింది. ఇందులో ఆలం ప్రైవేటు కార్యదర్శి సంజీవ్ లాల్ పనిమనిషి జహంగీర్ నివాసంలో జరిగిన తనిఖీల్లో ఈ నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఈ ఇంట్లో 32 కోట్లు, మరో రెండు చోట్ల 3కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Discussion about this post