2021 అమెరిక అధ్యక్ష ఎన్నికల్లో 59 ఏళ్ల భారత సంతతికి చెందిన కమలా హార్రీస్ మొదటి మహిళా వైస్ ప్రసిడెంట్ గా ఎన్నికై చరిత్రను నెలకొల్పారు. అయినప్పటికీ ఆమెకు అనుకున్నంత పేరు ప్రతిష్టలు రాలేదు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆమె టాప్ గేర్ లో ఉన్నారు. 6 వారాల అబార్షన్లపై ట్రంప్ నిషేధాన్ని విధించడంతో దానిని ఖండించడం ద్వారా హార్రీస్ ఫ్రంట్ లైన్ లో నిలిచారు. వాస్తవానికి అదే విషయం డెమోక్రాట్లయిన బైడెన్, హార్రిస్ విజయానికి కారణమైంది. ఫ్లోరిడాలోని జాక్సన్విల్లే లో ‘స్వేచ్ఛకోసం పోరాడు’ నినాదంతో ఆమె ప్రత్యర్థులైన రిపబ్లికన్లపై విరుచుకుపడుతోంది. ఆమె మహిళల కోసం పోరాడుతూ వారికి స్ఫూర్తిగా నిలుస్తోందని ఫ్లోరిడా మేయర్ డోనా డీగన్ ప్రశంసించారు.
అర్థశతాబ్దం నుంచి వస్తున్న అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పునివ్వడం పై రెండేళ్లుగా హారిస్ ఫైట్ చేస్తోందని ఆమె అనుచరులు చెబుతున్నారు. 2020లో బైడెన్ కు విజయాన్నందించిన ఓటర్ల కూటమిని ఆమె లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. బ్లాక్ ఓటర్ల నుంచి మాత్రం అనుకున్నంత మద్దతు లభించడం లేదు. నూతనంగా ప్రకటించిన ఆర్థిక విధానాల ద్వారా అట్లాంటాలోని నల్ల పురుషులను ఆమె ఆకట్టుకున్నారు. గాజాపై అమానవీయంగా మిలటరీ దాడులు చేస్తు్న్న ఇజ్రాయిల్ కు మద్దతు ప్రకటించడంపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
హక్కుల కోసం పోరాడే కుటుంబం నుండి వచ్చిన హారిస్, గాజాపై మాట్లాడే విషయానికి వస్తే బైడెన్ కంటే ఒక అడుగు ముందున్నట్లు అనిపిస్తోంది. అమెరిక పౌర హక్కుల పోరాటంలో ముఖ్యమైన అలబామాలో గాజాపై ఇజ్రాయిల్ తక్షణ కాల్పుల విరమణ ప్రకటించాలని ఆమె మార్చిలో పిలుపునిచ్చారు. పాలస్తీనా పౌరుల దుస్థితి పై మాట్లాడారు. అయితే ఆమె ఫ్లోరిడా నుంచి తిరిగి వెళుతున్నప్పుడు పాలస్తీనా అనుకూల నిరసనకారుల శిబిరాలను పోలీసులు విచ్ఛిన్నం చేసిన చిత్రాలు బయటకు రావడంతో అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఒకే గూటి పక్షులని అమెరికా ప్రజలు తెలుసుకున్నారు.
హారిస్ కొత్తగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రతివిషయంలోనూ ఆమెతోపాటు అనుచరులు, సిబ్బంది ఆచితూచి అడుగేస్తున్నారు. ఆమె అనేక ఏళ్లు గా వ్యతిరేక వార్తలు, విమర్శలు, రిపబ్లికన్ల ఆరోపణలు ఎదుర్కొన్నారు. బైడెన్ లా కాకుండా ఆమె చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇస్తారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగ ఉన్న సమయం నుంచి జోబైడెన్ కీలక పాత్రను పోషించారు. అయితే హార్రీస్ మాత్రం ఈ విషయంలో వెనుకబడ్డారు. సెంట్రల్ అమెరికాలో వలసలతో వ్యవహరించే విషయంలో చాలా విమర్శలను ఆమె ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుతం బైడెన్ , హార్రిస్ లతో ఒకే విధమైన సమస్యలను ఓటర్లు ఎదుర్కొంటున్నారు. ఆమెకు 38.5 శాతం, బైడెన్ కు 38.9 శాతం మద్దతు లభించింది. వాస్తవానికి అమెరిక అధ్యక్ష పదవి ఆకర్షణీయంగా కనిపించే కఠినమైన ఉద్యోగం. ప్రచారంలో హార్రిస్ ముందున్నారని బోస్టన్ యూనివర్సిటీలో అసోసియేట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న థామస్ వేలన్ అన్నారు. మరీ ముఖ్యంగా అబార్షన్ విషయంలో ఆమె వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారన్నారు. అయితే నల్ల జాతి ఓట్లను రాబట్టడంలో ఆమె వెనుకబడుతున్నట్లు కనిపిస్తుందన్నారు. రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కోర్టు కేసుల్లో ఉంటే .. డెమాక్రేట్ల మెడకు గాజా ఉచ్చుగా మారింది.
Discussion about this post