భూతాపం పెరగడంతో పగడపు దిబ్బలకు ప్రమాదం ముంచుకొచ్చిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగోళంతోపాటు, సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం మార్పు చెంది భూమిపై సమస్త జీవజాతులకు ముప్పు దాపురించిందని సైంటిస్టులు చెబుతున్నారు. సుమారు 53 దేశాల్లో ని పగడపు దిబ్బలు తుడిచిపెట్టుకు పోతున్నాయని 2023 ఫిబ్రవరిలోనే తెలిపారు. 2010 వేసవిలో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వినాశకరమైన 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. దీంతో పగడాల పైపొర క్షీణించి బ్లీచింగ్ అనే ప్రక్రియలో పగడాలు వాటి రంగును కోల్పోయి తెల్లగా మారాయి.
Discussion about this post