గంగవరం పోర్టు వద్ద కార్మికులు ఆందోళన చెపట్టారు. తమ గ్రామాలను ఖాళీ చేయించి పోర్టు నిర్మాణానికి ఇచ్చామని… సముద్రంలో చేపల వేట కూడా ఆపేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసిన తమకు ఎలాంటి పరిహారం అందలేదని చెప్పారు. తమను నెలకు 36 వేల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ కింద 50 లక్షలు ఇవ్వాలన్నారు.
Discussion about this post