మొబైల్ రంగంలో దూసుకుపోతున్న Motorola కంపెనీ వినియోగదారుల కోసం తన సరి కొత్త వేరియంట్ Edge 50 Pro ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. దీనిలో snap dragon 7 generation three processor తో పాటు 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా setup, 125 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ సదుపాయం కలిగి ఉంది. ఎడ్జ్ 50 ప్రో ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉండి, మూడు రంగు విభిన్న రంగులలో దీన్ని ప్రవేశపెట్టారు. అత్యధికంగా 12GB RAM తో పాటు 256GB ఇంటర్నల్ మెమొరీ దీని సొంతం. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వినియోగదారులు ఇష్టపడే ఫ్యూచర్స్ దీని సొంతం. 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల POLED కర్వ్డ్ డిస్ప్లేను Edge 50 Pro కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్ సెటప్, మూడు మైక్రోఫోన్లు, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇందులో పొందుపరిచారు. దీని ధర ప్రస్తుత మార్కెట్ లో 31,999 నుండి ప్రారంభమవుతుంది. Motorola Edge 50 Pro ను వినియోగదారులు Flipkartలో కొనవచ్చు.
Author: Sayed Mirza
Discussion about this post