దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎండతోపాటు వేడిగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. గాలిలో అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్లలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించింది.ఈ క్రమంలోనే తూర్పు మధ్యప్రదేశ్‌లో రాత్రివేళల్లో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. అయితే రాత్రి పూట ఉష్ణోగ్రత ప్రమాదకరమని, శరీరం చల్లబడేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్-జూన్ కాలంలో 10 నుంచి 20 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన.. కాంగ్రెస్ వస్తే ప్రజల సంపదను లూటీ చేసి, మైనారిటీలకు పంచుతుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పటికీ మోదీ తగ్గలేదు. విమర్శల దాడిని మరింత పెంచారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఇండి కూటమి నేతలు భవిష్యత్తుపై ఆశలు వదులుకున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని హెచ్చరించారు. కాంగ్రెస్, ఇండి కూటమి ప్రజల ఆదాయం, సంపదపై కన్నేశాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎన్ని ఇళ్లు ఉన్నాయి? అనే దానిపై విచారణ జరిపిస్తామని ఆ పార్టీ యువరాజు చెప్పారని విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.బెయిల్ లభిస్తుందా? లేదా? అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో ఈనెల 23 వరకూ ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నేడు వర్చువల్ గా కవితను అధికారులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టు ముందు దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై న్యాయవాదులు వాదనలు వినిపించనునున్నారు. సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మే 2 వ తేదీ కావేరి భవేజ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.
Discussion about this post