విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరిల్లోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణాపురం ప్రాంతంలో ధనల అమర్ ను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో తలపైమోది హత్య చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మృతుడు అమర్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమర్ జీవీఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహించేవాడని మృతుని స్నేహితులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న సీపీ రవిశంకర్ సంఘటనకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి చందు అందిస్తారు.
Discussion about this post