వైసీపీ పాలనలో అనేక సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తి పోయారని టీడీపీ నేత మండలి వెంకట్రామ్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం నాగాయలంకలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాదులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడిన ప్రజలు ఎన్నికలు వచ్చిన వెంటనే ఈ వైసీపీ పాలకులను ఓడించటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
Discussion about this post