తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారి పని పడుతోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరీని కూడా ఏసీబీ అధికారులు విడిచిపెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్ చేసి మరీ చిక్కించుకుంటోంది ఏసీబీ. తెలంగాణలో ప్రతి నాలుగు రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదు అవుతున్న పరిస్థితి.రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా.. వంద రోజుల్లో ఏకంగా 55కి పైగా ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. అన్ని శాఖల్లో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. పట్టుబడుతున్న వారిలో పోలీస్, రెవెన్యూ శాఖ టాప్ లిస్ట్‌లో ఉన్నారు. పది రోజుల్లో పలువురు పోలీసులు కూడా ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. మీర్పేట్ ఎస్సై, మాదాపూర్ ఎస్సై, స్టేషన్ రైటర్, అసిఫాబాద్ ఎస్సై ఏసీబీ వలలో పట్టుబట్టారు. లంచం తీసుకుంటున్న అధికారుల ఆస్తులను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ లోతుగా దర్యాప్తు సాగుతోంది.
Discussion about this post