కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం 90 లక్షల 90వేల 850లు వచ్చినట్లు దేవస్థానం డిప్యూటీ కమీషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. సోమవారం దేవాదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణధికారి నాగ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో హుండీలు తేరిసి లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా 70లక్షలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 20లక్షలు మొత్తం కలిపి రూ 90 లక్షలు వచ్చినట్లు తెలిపారు ఈఓ భూపతి రాజు కిషోర్ కుమార్.
Discussion about this post