ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలక వైసీపీ .. విపక్ష టీడీపీ రెండూ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సారి టీడీపీ,బీజేపీ,జనసేన కూటమి గా ఏర్పడి రంగంలోకి దిగగా జగన్ ఒక్కరే కూటమిని ఎదుర్కొంటున్నారు. జగన్ సోదరి కాంగ్రెస్ సారధిగా పార్టీని నడిపిస్తున్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. పేరుకే త్రిముఖ పోటీ కానీ వైసీపీ టీడీపీలమధ్యనే అసలు పోరు జరుగుతుంది. షర్మిల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. షర్మిల జగన్ పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాను స్వయంగా కడప లోకసభకు పోటీ చేస్తున్నారు.
Discussion about this post