ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్ తో అకాల మరణం తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. రెడీ టు ఈట్ మీట్, పౌల్ట్రీ, సీ ఫుడ్, షుగరీ డ్రింక్స్ డైయిరీ బేస్డ్ డిజర్ట్స్, హైలీ ప్రోసెస్డ్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించాయని తెలుస్తోంది. మనం వంటింట్లో ఉపయోగించని కృత్రిమ రంగులు, ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే రసాయినాలు,అధిక సంతృప్త కొవ్వు పదార్థాలను ఆల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్ లో ఉపయోగిస్తున్నారు. దీంతో ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటోంది. అసలు ప్రొసెస్డ్ ఫుడ్ అంటే ఏమిటి ? మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాతో తెలుసుకుందాం…
ఫుడ్ ప్రాసెసింగ్ అంటే వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా మార్చడం లేదా ఒక రకమైన ఆహారాన్ని ఇతర రూపాల్లోకి మార్చడం. అల్ట్రాఫుడ్ ప్రాసెసింగ్ అంటే రెడీ టు ఈట్ ఆహారాలు ఉదాహరణకు కేకులు, తీపితో నిండిన తృణ ధాన్యాలు, వేడి చేసిన ఆహారాలు, బాగా ఫ్రై చేసిన చికెన్, శీతల పీజా, రెడీ టూ హీట్ మీల్స్. వీటిలో పోషకపదార్థాలు, పీచు ఉండకపోవడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తెలెత్తుతున్నాయని 30 ఏళ్ల పాటు జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. తరచూ ఈ ఫుడ్ ను తీసుకునే వారిలో 13 శాతం మంది అకాల మృత్యువుకు చేరువవుతున్నారు.
30 ఏళ్లలో 1లక్ష 14 వేల మందిపై పరిశోధనలు చేసి ప్రతిరోజూ ప్రాసెస్డ్ మాంసాహారం తీసుకునేవారిలో అకాల మృత్యువు 13 శాతం ఎక్కువగా ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనాలు తేల్చాయి. హైషుగర్ , ఆర్టిఫీషియల్ స్వీట్ బెవరేజెస్ తీసుకునేవారిలో అకాల మరణ ముప్పు 9 శాతానికి పెరిగిందన్నారు. 34 ఏళ్ల అధ్యయనంలో వారు 48 వేల 193 అకాల మరణాలను గుర్తించారు. కేన్సర్ తో 13 వేల 557 మరణాలు, గుండె జబ్బులతో 11,416 మరణాలు , న్యూరో డిజెనరేటివ్ తో 3 వేల 926 మంది మృతి చెందారు. అల్ట్రా ప్రొసెస్డ్ ఆహారం మరీ ముఖ్యంగా మాంసం, షుగర్ డ్రింక్స్, డిసెర్ట్స్, బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడంతో మరణాన్ని దగ్గర చేస్తాయని ఆ నివేదిక తెలిపింది. దీర్ఘకాలం రెడీమేడ్ ఫుడ్స్, అల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్ తీసుకోవడం కేన్సర్, మానసిక ఆరోగ్య సమస్యలు, టైప్ 2 డయాబెటీస్ వంటి తీవ్ర అనారోగ్యాలతోపాటు అకాల మరణానికి దారితీస్తాయని అధ్యయనాలు హెచ్చిరిస్తున్నాయి.
విదేశాలలో, UPFలు ఇప్పుడు సగటు వ్యక్తి ఆహారంలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి, ఇది రోజువారీ ఆహారంలో సగం వరకు ఉంటుంది. యువకులు, తక్కువ ఆదాయం ఉన్నవారిలో ఈ నిష్పత్తి 80% వరకు పెరుగుతుంది. దీనిని నివారించేందుకు ప్రొసెస్ లేని లేదా అతితక్కువ ప్రొసెస్ చేసిన ఫుడ్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అందులో భాగంగా పళ్లు, కూరలు, గింజలు, అన్ ప్రొసెస్డ్ ఉత్పత్తులైన గుడ్లు, చేపలు, మాంసం తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో 30 శాతం వరకు అవసరమైన పోషకాలు ఉంటాయన్నారు. అల్ట్రా ప్రోసెస్డ్ లో అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి. ముతక ధాన్యాలు, చిరు ధాన్యాలలో పౌష్టికాహార విలువలు చాలా ఎక్కువ. …వాటిలో ముఖ్యమైనవి నువ్వులు, వేరుశనగ, బాదం, జీడిపప్పు మొక్కజొన్న, జొన్న వంటివి ఆరోగ్యానికి మంచివి. హోం ఫుడ్ బెస్ట్ ఫుడ్
Discussion about this post