మరికొన్ని గంటల్లో నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఈవీఎంతోపాటు వీవీ ప్యాట్ పక్కన ఉంటాయి. ఓటు వేసిన వివరాలు వీవీ ప్యాట్‌లో తప్పనిసరిగా ఉంటాయి . ఓటుపై సందేహాలు ఉంటే వీవీప్యాట్ స్క్రీన్ మీద ఓటరు తన ఓటును పరిశీలించుకోవచ్చు. 7 సెకన్ల పాటు మాత్రమే ఎవరికి ఓటు వేశామనేది స్ర్కీన్ మీద కనిపిస్తోంది.
పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం, వీవీ ప్యాట్ పక్క పక్కనే ఉంటాయి. ఓటు వేసిన తర్వాత ఏ గుర్తుకు వేశామనే విషయం వీవీ ప్యాట్ మీద ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తోంది. తర్వాత మిషన్ కింద భాగంలో ఉన్న బాక్స్‌లో స్లిప్ పడిపోతుంది. పోలింగ్ అధికారి వద్ద ఉండే కంట్రోల్ యూనిట్‌కు చేరుతుంది. ఓటుపై సందేహాం కలిగితే వీవీప్యాట్‌లో నమోదైన కాగితాల ఆధారంగా పరిశీలిస్తారు.. ఇప్పుడు ఆ వీవీ ప్యాట్ స్లిప్ ఓటరుకు ఇస్తారని తెలుస్తోంది. రూ.10 కడితే చాలు మీకు వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారని సమాచారం.
Discussion about this post