బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సంచలన కామెంట్స్ చేశారు. హరీష్‌రావు రాజీనామా లేఖ వృథా కానివ్వమని దాన్ని స్పీకర్ తో ఆమోదింపచేస్తామని అయన అన్నారు.10 ఏళ్లుగా హరీష్‌రావుకి, బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరుల స్థూపం గుర్తుకు రాలేదని బల్మూర్ వెంకట్ విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరతారని స్పష్టం చేశారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారని దుయ్యబట్టారు. ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా హరీష్‌రావు రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసినా రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా? అని సూటిగా ప్రశ్నించారు.
కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆగస్ట్ 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్టుగా బీఆర్ఎస్ రద్దు చేస్తారో, లేదో కేసీఆర్ చెప్పాలన్నారు.
Discussion about this post