ఐదేళ్ల వైసీపి పాలనలో కనీసం త్రాగునీరు కూడా అందించలేదని శింగనమల కూటమి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ అన్నారు. వైసీపి అభ్యర్థి వీరాంజనేయులు నిజంగా టిప్పర్ డ్రైవర్ అయితే తన లైసెన్స్ చూపించాలని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. వైసీపి MLA భర్త సాంబశివారెడ్డి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడని, నియోజకవర్గ అభివృద్ధిని అటకెక్కించాడని చెప్పారు. ఇప్పుడు తన ప్రధాన అనుచరునికి శింగనమల టికెట్ ఇప్పించాడని, సింపతీ కోసమే టిప్పర్ డ్రైవర్ అని ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
Discussion about this post