ప్రపంచంలో కోవిడ్ సృష్టించిన నష్టం అంతఇంతా కాదు. దీంతో నమోదైన మరణాలు లక్షల్లో ఉన్నాయి. దీని భారీన పడినవారు కోట్లలో ఉన్నారు. తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ వైరస్ నుంచి రక్షించుకోవడానికి పలు దేశాల సైంటిస్ట్‌లు తీవ్రంగా శ్రమించి వ్యాక్సిన్లను కనుగొన్నారు. కానీ.. వాటితో ధీర్ఘకాలంలో వచ్చే సైడ్ ఎఫెక్స్ని కనిపెట్టలేకపోయారు. వ్యాధిని ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రతిపదికన ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చి వాడారు. అయితే ఈ వ్యాక్సిన్లతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? భారత్‌పై దీని ప్రభావం ఏంటి? కోర్టు ఏం చెప్తుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరి.
కోవిడ్-19 టీకా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్స్ వస్తున్నాయని పలువురు కోర్టుకెక్కారు. దీనిపై స్పందించిన కంపెనీ… రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం వంటి అరుదైన దుష్ప్రభావాలు తలెత్తుతాయని బ్రిటన్ ఫార్మ ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. భారత్‌లోనూ ఈ టీకాను విస్తృతంగా వినియోగించిడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో కొవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలనకు వైద్య నిపుణల కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో దుష్ప్రభావాలు, ఆరోగ్యపరంగా ముప్పు కారణాలపై ఈ కమిటీతో దర్యాప్తు చేయించాలని అభ్యర్ధించారు.
ఈ అధ్యయనాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షించాలని పిటిషనర్ కోరారు. కోవిడ్ 19 సమయంలో టీకా తీసుకుని వైకల్యానికి గురైన పౌరుల కోసం వ్యాక్సిన్ డ్యామేజ్ పేమెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వారికి ఇవ్వబడిన కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాల కారణంగా తీవ్రంగా అంగవైకల్యం పొందిన లేదా మరణించిన వ్యక్తులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తిని కోరింది.
అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను భారత్‌లో పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. దేశవ్యాప్తంగా 175 కోట్ల డోస్‌లను పంపిణీ చేశారు. ఇక, ఆస్ట్రాజెనెకాపై యూకేలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కొవిషీల్డ్ టీకా అనేక సందర్భాల్లో మరణాలతోపాటు తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైందని ఆరోపిస్తూ 50 మందికి పైగా బాధితులు 100 మిలియన్ పౌండ్ల నష్ట పరిహారం కోరుతూ యూకే హైకోర్టును ఆశ్రయించారు. అయితే గతంలో ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది. కానీ, ఫిబ్రవరిలో అరుదైన సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉందని కోర్టుకు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది.
Discussion about this post