మహానటి సావిత్రి, ఈ పేరుగురించి పరిచయం అవసరం లేదు. నాటికి… నేటికీ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అనేలా ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఆమె నిలిచిపోయారు. భౌతికంగా ఆమె మనకి దూరమైన ఆమె నటించిన చిత్రాలు నేటికీ మనల్ని అలరిస్తూనే ఉన్నాయి. నటనలోనే కాదు మానవత్వాన్ని చాటుకోవడంలోనూ ఆమెకు ఆమె సాటి.
అతి చిన్న వయసులోనే అత్యంత కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న ఆమె, అంతే తొందరగా అధఃపాతాళానికి పడిపోయారు. అంతా తనవాళ్ళే అనుకుని చివరికి ఒంటరిగా మిగిలిపోయారు. సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకుని నిరుపేదగా కన్నుమూశారు. ఇక ఆ మహానటి గురించి గతంలో సావిత్రి గారి జీవిత కథగా మహానటి సావిత్రి అనే ఓ బుక్ రిలీజ్ అయ్యింది.
అయితే తాజాగా మహానటి సావిత్రి గురించిన మరో పుస్తకం సావిత్రి క్లాసిక్స్ కూడా విడుదలైంది. హైదరాబాద్ లోని N కనెన్షన్ లో సంజయ్ కిషోర్ రాసిన సావిత్రి క్లాసిక్స్ అనే బుక్ మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఆమెతో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాను సావిత్రితో కలిసి పునాది రాళ్లు, ప్రేమ తరంగాలు అనే రెండు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. ఇక పునాది రాళ్లు సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్న సమయంలో తనని ఆమెకు పరిచయం చేసారని చెప్పారు. అయితే అనుకోకుండా ఓ రోజు సినిమా షూటింగ్ మధ్యలో వర్షం పడి షూటింగ్ ఆగిపోయిందని.. ఆ సమయంలో తనని డాన్స్ చేయమని సావిత్రి కోరినట్లు చెప్పారు. ఇక సావిత్రి అడిగిన వెంటనే తన దగ్గర ఉన్న టేప్ రికార్డర్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ సాంగ్స్ కి డ్యాన్స్ చేశానని అన్నారు.
Discussion about this post