అక్కడ ఎన్నో రోజుల నుంచి అభ్యంతకరమైన వ్యవహారం నడుస్తోంది. ఆడవారు, చిన్నారులు, అనేక కుటుంబాలు ఉండే ప్రాంతంలో ఈ తతంగం నడుస్తోంది. ఈ విషయం గురించి అధికారంలో ఉన్న నాయకుల నుంచి ప్రతిపక్షంలో ఉన్న నాయకుల వరకు అందరికి చెప్పారు… ఫలితం శూన్యం.. అధికారులకూ తమ ఇబ్బందిని వివరించారు.. అయినా లాభం లేదు. ఇన్ని చేసినా.. ఉపయోగం లేకపోయే సరికి… ఆ ప్రాంత వాసులంతా .. కుటుంబ సమేతంగా ఆందోళన, ధర్నాలకు దిగారు… అసలక్కడ ఏం జరుగుతోంది… వారి సమస్యలేంటి… వారి ధర్నాతోనైనా సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందా…
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ప్రధాన రహదారిపై జనవాసాలు, విద్యా సంస్థల మధ్యలో ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. సరైన అనుమతి లేకుండా వైన్ షాప్ నిర్వాహకులు అక్కడే ఓపెన్ బార్ నడుపుతున్నారు.; ఇది స్థానికులకు ఇబ్బందిగా పరిణమించింది. మహిళలు.. పిల్లలు అటుగా నడవడానికి భయపడుతున్నారు. అపార్ట్మెంట్స్, స్కూల్స్ కి దగ్గర ఉన్నకారణంగా మహిళలు పిల్లలు అభ్యంతరం చెబుతున్నారు.
అపార్ట్మెంట్, విద్యాసంస్థలు, కాలనీల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల ఇళ్లలో నుంచి మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ విషయంపై నెల రోజులుగా ఎక్సైజ్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, చివరికి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని కాలనీ వాసులు వాపోతున్నారు.దాదాపు 80 ఫిర్యాదులు ఇదే వైన్ షాప్ గురించి అధికారులకు అందాయి. ప్రజావాణి లో ఇదే అంశంపై మంత్రులకు ఫిర్యాదు అందింది. అయినా స్పందించిన వారే లేరు. .
వైన్ షాపు విషయంలో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల మధ్య వైన్ షాప్ నిర్వహించడం వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే సమస్యను పరిష్కరించమని కోరుతున్నారు. లేదంటే పరిణామాలు మరో స్థాయిలో ఉంటాయని అక్కడి అపార్ట్ మెంట్ వాసులంటున్నారు.
అక్కడున్న వైన్ షాపును తొలగించాలని మహిళలతో సహా… చిన్నారులు ధర్నాలో పాల్గొంటున్నారు… స్కూలుకు వెళ్లే సమయంలో… తిరిగి వచ్చే సమయంలో చాలా సమస్యగా ఉంటుందంటున్నారు. అక్కడ నుంచి వైన్స్ తీసేయాలని తల్లిదండ్రులతో పాటు వారి పిల్లలు కూడా ఆందోళన చేస్తున్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తున్నారు.
ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి పోయినట్లు… ఈ విధంగానైనా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమోనని చిన్న ఆశతో ధర్నా చేస్తున్నామంటున్నారు. వారి ఇబ్బందులను గమనించి ఫోర్ సైడ్స్ టీవీ వారి సమస్యలపై ఫోకస్ చేసింది… ఈ విధంగానైనా వారికి మంచి జరుగుతుందేమో నని ఫోర్ సైడ్స్ టీవీ ఆశిస్తోంది.
Discussion about this post