టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఓటుకు 6 వేలు పంచుతారని ఆయన అన్నారు. లోకేశ్ డబ్బులు పంచినట్టు మన వైసీపీ అభ్యర్థి లావణ్య పంచలేదని… ఎందుకంటే లోకేశ్ దగ్గర ఉన్నట్టు లావణ్య దగ్గర డబ్బులు లేవని చెప్పారు. లోకేశ్ డబ్బులు ఇస్తే తీసుకోవాలని… అయితే ఓటు వేసే ముందు మాత్రం ఆలోచించాలని అన్నారు. జూన్, జులై నెలల్లో చేయూత, నేతన్న హస్తం, అమ్మఒడిని ఎవరు ఇస్తున్నారో వారికే ఓటు వేయాలని సూచించారు.
Discussion about this post