ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. భక్తుల రద్దీతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. కృష్ణతేజ అతిథిగృహం వరకూ భక్తులు బారులు తీరారు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మున్ముందు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు. ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి. ఈ పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. రోజువారీ కంటే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున.. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలను తీసుకున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.
Discussion about this post