కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి అభివృద్ధి చేసిందో చెప్పకుండా తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని పాలమూరు బిజెపి అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తానని దీనికి మోడీ గ్యారెంటీ ఇప్పిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు. దేశంలో రాహుల్ గాంధీ గెలిస్తేనే 6 గ్యారంటీలను అమలు చేస్తామనడంలోనే .. ఆయన గెలిచేది లేదు గ్యారెంటీ అమలుపరిచే పరిస్థితి లేదని అర్ధం అవుతుందని అరుణ అన్నారు.
Discussion about this post