భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు. వన్డేల్లో మూడు ద్విశతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ. అభిమానులు అతడిని ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకుంటారు. అయితే.. ఐపీఎల్ 17వ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. 11 మ్యాచుల్లో 32.60 సగటు, 154.50 స్ట్రైక్‌రేటుతో 326 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా రోహిత్ రాణిస్తున్నప్పటికి అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు దాదాపుగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన ముంబై ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది. మూడు మ్యాచుల్లోనే గెలిచింది. 6 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ముంబైకి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను ఈ సీజన్‌కు ముందు సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన ముంబై ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది. మూడు మ్యాచుల్లోనే గెలిచింది. 6 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ముంబైకి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను ఈ సీజన్‌కు ముందు సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గురించి ఒక్క ముక్కలో చెప్పాలని పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటాను ఓ ఫ్యాన్ కోరగా…టాలెంట్‌కి పవర్‌హౌస్‌లాంటోడు అని చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఏమంత గొప్పగా లేదు. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడగా ఏడు మ్యాచుల్లో ఓడిపోయి… నాలుగు మ్యాచుల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
Discussion about this post