సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా అధికారుల తెలిపారు. మొత్తం 20 లక్షల 12 వేల 373 మంది ఓటర్ల కోసం 1,991 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామని వెల్లడించారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుందన్నారు. సాయంత్రం 6 గంటలలోగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 11 రకాల కనీస వసతులు కల్పించామని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించామన్నారు. ఎన్నికల నిర్వహణకు 13 వేల 069 మంది సిబ్బందిని నియమించామన్నారు.
Discussion about this post