అందమైన గ్రహంగా పేరున్న శుక్రగ్రహం ఉపరితలం నుంచి కార్బన్, ఆక్సిజన్ వాయువులు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని యూరప్ బెపికొలంబో స్పేస్ పరిశోధనల నుంచి వెలువడే ఫ్లైడేటా వెల్లడించింది. బుధగ్రహంపై ప్రయోగించిన అంతరిక్ష నౌక శుక్రగ్రహం మీదుగా ప్రయాణించడంతో వెలువడుతున్న వాయువుల సమాచారం తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మన పొరుగు గ్రహమైన శుక్రుడు కొత్తరకం వెలుగును ప్రసరింప చేయడంతో వీనస్ చుట్టూ అయస్కాంత క్షేత్రం బలంగా లేదని ఫ్లైడేటా తెలుపుతోంది. ఈ విషయ పరిజ్ఞానం శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భూగ్రహంలో మాదిరిగా అంతర్గతంగా స్థిరంగా ఉండే బలమైన అయస్కాంత క్షేత్రం వీనస్ లో ఉండదు. ఎందుకంటే శుక్రగ్రహం లోపలి శీతల భాగం నీటి శబ్దంతో సుడులు తిరగదు. అలా తిరిగి నప్పుడు మాత్రమే మేగ్నటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. కాషాయరంగులోని శుక్ర గ్రహంపై సూర్యకిరణాలు పడగానే అయస్కాంత గోళాన్ని ఉత్పత్తి చేసే విద్యుత్ ప్రవాహాలను సృష్టిస్తుంది.
బెపికొలంబో 2021 ఆగస్టులో తోకచుక్క ఆకారపు అయస్కాంత క్షేత్రంలోకి 90 నిముషాలు ప్రయాణించి దాని గమ్యస్థానం అయిన బుధగ్రహం దరికి ప్రయాణించినపుడు శాస్త్రవేత్తలు ఈ విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు.
విద్యుత్ పూరిత అణువులు లేదా అయాన్లు ప్లానెట్ నుంచి అత్యంత వేగంగా అంతరిక్షంలోకి వెదజల్లబడుతున్నా్యని తెలుసుకున్నారు. తద్వారా శుక్రగ్రహంలో గురుత్వాకర్షణ లేదని తెలిసింది. వాస్తవానికి ఇవన్నీ బరువైన అణువులు ఇవి నెమ్మదికా కదులుతాయి. అందువల్ల దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుందని ఫ్రాన్స్ లోని ప్లాస్మా ఫిజిక్స్ లాబొరేటరీ శాస్త్రవేత్త లిన హడిడ్ చెప్పారు.
శుక్రగ్రహం దళసరిగా ఉండే ఉపయుక్తంకాని గ్రహం. అయినప్పటికీ కొద్ది మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇంకా మరికొన్ని వాయువులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు మొదట రాత్రిసమయాల్లో అతికొద్ది పరిమాణంలో ఆక్సిజన్ ఉంటుందని భావించారు. అయితే గత నవంబరులో జరిగిన పరిశోధనల్లో పగలుకూడా ఆక్సిజన్ ఉంటుందని తెలుసుకున్నారు. శుక్రుడి ఆక్సిజన్ సాంద్రత తగ్గుతున్న సౌర వికిరణంతో సమానంగా పడిపోతుందని శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది.
కణాల నష్టపోయే పనితీరుపై పరిశీలన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గ్రహాల వాతావరణం ఎలా పుడుతుంది ? ఎలా వాటిలోని నీటిని కోల్పోతాయి అనేది దీనివల్లే తెలుస్తుంది. ఏడేళ్ల ప్రయాణాన్ని ముగించుకొని 2025 నాటికి మెర్క్యురీ పైకి బెపికొలంబో కాలుపెడుతుందని పరిశోధకులు అంచనావేస్తున్నారు. 2031 నాటికి యూరప్ ఎన్ విజన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించాలని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన నాసాకూడా 2029 నాటికి డావిన్సి స్పేస్ షిప్ ను ప్రయోగించాలని భావించినప్పటికీ అది 2031 నాటికి వాయిదా పడింది.
Discussion about this post