మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే దుష్ర్పవర్తన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రంప్ నకు మరోసారి ఆయన ఇంట్లో ప్రభుత్వ పత్రాలు దొరకడంతో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ట్రంప్ మార్-ఎ-లాగో బెడ్ రూంలో మరికొన్ని క్లాసిఫైడ్ రికార్డులు దొరికాయి. చెందిన ఫ్లోరిడా ఎస్టేట్ ఇంటిలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI వీటిని కనుగొంది. అధ్యక్షుడిగా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కొన్ని రహస్య పత్రాలను తనతో తీసుకెళ్లినట్లుగా నిఘా సంస్థ ధృవీకరించింది. గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడం, న్యాయాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వం రికార్డులను నేరపూరితంగా నిర్వహించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అమెరికా లా డిపార్ట్మెంట్ ట్రంప్ పై విచారణ చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ బీ ఐ ఏజెంట్లు ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో ఇంటిలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టి ఆ ఇంటి నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
2022లో కూడా ట్రంప్ ఇంటినుంచి ప్రభుత్వానికి సంబంధించిన అనేక రికార్డుల స్వాధీనం చేసుకున్నారు. గతేడాది డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ ఇంట్లో 11 వేలకుపైగా ప్రభుత్వ పత్రాలు దొరికినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెప్పారు. వీటిలో కీలకమైన ఫొటోలు, టాప్ సీక్రెట్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఖాళీగా ఉన్న 90 ఫోల్డర్లను కూడా ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది. అందులో 48పై ‘క్లాసిఫైడ్’ అని రాసుండగా.. 42పై ‘స్టాఫ్ సెక్రటరీ లేదా మిలటరీ ఎయిడ్‌కు తిరిగిచ్చేయండి’ అని రాసి ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం రహస్య పత్రాలను అక్రమంగా అతని ఇంట్లో ఉంచుకున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా 20 పెట్టెలను స్వాధీనం చేసుకోగా, ఇందులో 11 సెట్ల రహస్య పత్రాలున్నాయి.
మార్- ఎ- లాగో రిసార్ట్ లో ప్రభుత్వ రహస్య పత్రాలతో పాటు కొన్ని ఫోటోలు దొరికాయి. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ వద్ద ఉన్న ట్రంప్ నివాసంలో రహస్య గదులను తెరిచి మరీ కొన్ని విలువైన పత్రాలు తీసుకెళ్లారు. దొరికిన 11 సెట్ల డ్యాక్యుమెంట్లలో నాలుగు సెట్ల టాప్ సీక్రెట్ పత్రాలు, మూడు సెట్ల సీక్రెట్ పత్రాలు, మరో నాలుగు సెట్ల కాన్ఫిడెన్షియల్ పత్రాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో పాటు చెత్తో రాసిన నోట్లు, ఫోటోగ్రాఫ్ లను కూడా ట్రంప్ నివాసం నుంచి స్వాధీనం చేసుకుంది. దొరికిన పత్రాల్లో 2019లో ట్రంప్ స్నేహితుడు రోజర్ స్టోన్ కు క్షమాభిక్ష పత్రాలు కూడా లభించాయి. ఆ సమయంలో ట్రంప్ వాటిపై సంతకాలు చేశారు. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా కలుగజేసుకుందా.. అనే విషయంపై అమెరికా కాంగ్రెస్ కు అబద్దాలు చెప్పారనే కేసులో మూడేళ్లు జైలు శిక్ష పడింది. ట్రంప్ ఈ శిక్షలను రద్దు చేశారు. రహస్య పత్రాల్లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన రహస్య సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా న్యూక్లియర్ బాంబులు, అటామిక్ ఎనర్జీ గురించిన సమాచారాన్ని కలిగి ఉన్నారని తెలుస్తోంది. రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు నేరాభియోగాలు నమోదయ్యాయి. అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడు నేరాభియోగాలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి.
Discussion about this post