భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అఫ్ఘనిస్థాన్‌లో 300 మంది పౌరులు మృతిచెందారు. వేలాది మంది గాయడ్డారు. వెయ్యికి పైగా ఇండ్లు ధ్వంసమైనట్టు యూఎన్ ఫుడ్ ఏజన్సీ శనివారం వెల్లడించింది. బగ్లాన్, ఘోర్, హెరట్ ప్రాంతా లు వరదల ప్రభావానికి గురయ్యాయని తాలిబన్ ప్రతినిధి తెలిపారు. వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితులను వైమానిక దళం వారు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆ దేశ రక్షణ మంత్రి శనివారం తెలిపారు.
Discussion about this post