ఐపీఎల్ 2024 ట్రోపీని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కేకేఆర్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ విజయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, జట్టు సభ్యులతోపాటు మెంటార్ గౌతం గంభీర్ కీలక పాత్ర పోషించారు. కేకేఆర్ జట్టు విజయం తరువాత గంభీర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు విజయం అనంతరం మైదానంలోకి వచ్చిన కేకేఆర్ జట్టు యాజమాని షారూక్ ఖాన్ గౌతమ్ గంభీర్ ను హత్తుకొని అభినందనలు తెలిపారు.
కేకేఆర్ జట్టు మెంటార్ గా గంభీర్ వచ్చిన తరువాత ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ తో పాటు, బౌలింగ్ అటాక్ ను కూడా మార్చేశారు. సునీల్ నరైన్ ను ఓపెనర్ గా పంపించాలన్న గంభీర్ నిర్ణయం.. అద్బుత ఫలితాలను ఇచ్చింది. ఐపీఎల్ లో మేటి ప్రాంచైజీల్లో ఒకటిగా కేకేఆర్ జట్టు కూడా ఉందంటే నిస్సందేహంగా అందుకు ప్రధాన కారణాల్లో గంభీర్ ఒకరు. గతంలోనూ గంభీర్ కెప్టెన్సీలోనే 2012, 2014 సంవత్సరాల్లో కేకేఆర్ జట్టు ఐపీఎల్ ట్రోపీలను కైవసం చేసుకుంది. ఆ తరువాత అతను కేకేఆర్ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం 2024 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ జట్టు టైటిల్ నెగ్గడంలో గంభీర్ మెంటార్ గా కీలక భూమిక పోషించారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మెంటర్, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు ఆ జట్టు యజమాని, బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్ ఒకానొక సమయంలో బ్లాంక్ చెక్కును ఆఫర్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఆదివారం రాత్రి చెన్నైలోని చెప్పాకం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ అంతిమ పోరులో కేకేఆర్ జట్టు విజేతగా నిలించింది. తద్వారా 20 కోట్ల ప్రైజ్ మనీని అందుకోనుంది. దీంతో కేకేఆర్ జట్టు యాజమాన్యం సంబరాల్లో మునిగిపోయింది. అయితే, ఈ సీజన్లో కేకేఆర్ జట్టు విజేతగా నిలవడం వెనుక మెంటర్ గౌతం గంభీర్ కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చడం, ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం ద్వారా జట్టుని విజేతగా నిలపడంలో తనవంతు పాత్ర పోషించాడు.
కేకేఆర్ జట్టు గెలిచిన నేపథ్యంలో గంభీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సమయంలో కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా రావాలంటూ గౌతమ్ గంభీర్‌ను షారుఖ్ ఖాన్ కోరారని, ఇందుకుగానూ ఏకంగా బ్లాంక్ చెక్ ను ఆఫర్ చేశారని కథనాలు వస్తున్నాయి. పదేళ్లపాటు కోల్‌కతా జట్టుకి పనిచేయాలంటూ షారుఖ్ అడిగారన… గంభీర్‌ను ఎక్కువ కాలం పాటు జట్టుతో ఉంచాలనే ఉద్దేశంతో షారుఖ్ ఈ భారీ ఆఫర్ చేసినట్టు పేర్కొంది. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షారుఖ్ ఖాన్ సహ యజమాని అనే విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా కోచ్ రేసులో మాజీ క్రికెటర్ గౌతమ్ ముందు వరుసలో ఉన్నాడని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పలువురు విదేశీ కోచ్ రేసు నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ ముందు పెద్దగా ఆప్షన్లు లేవని, టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసుడు గౌతమ్ గంభీరేనని చెబుతున్నాయి. మరోవైపు గంభీర్ కూడా భారత కోచ్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీమిండియా కోచ్ గా వ్యవహరిస్తే కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా కొనసాగడం కుదురుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది?
Discussion about this post