సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అనగానే ముందుగా వినిపించేది అమర్ నాథ్ యాత్రే… అమర్ నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. సాక్షాత్తు పరమశివుడిని దర్శించుకునేందుకు హర..హర మహాదేవ అంటూ భక్తులు ఈ యాత్రను చేస్తారు. అయితే ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది.
ఈ ఏడాది జూన్ 29 అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు. యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్ముకశ్మీర్ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే అమర్నాథ్ యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తాజాగా అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు.
దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఈ అమర్నాథ్ ఆలయం ఉంటుంది. అనంతనాగ్జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్మార్గాల్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి… వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ప్రక్రియను ప్రారంభించనుంది. పలు భద్రతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. 2024 అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం అయ్యి…ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లాగే ఈ సారి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
అమర్ నాథ్ దేవస్థాన బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాత్ర కు సంభందించిన పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు. అమర్నాథ్యాత్ర సమయంలో ఉష్ణోగ్రతలు 5డిగ్రీల కన్నా తక్కువకు పడిపోవచ్చని, యాత్రికులు ఉన్నితో తయారు చేసిన దుస్తులను తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. గొడుగు, హీటర్, రెయిన్‌కోట్, వాటర్‌ప్రూఫ్ షూలను వాడాలని, వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని….దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులను వాటర్ ప్రూఫ్ బ్యాగుల్లో పెట్టుకోవాలని చెప్పింది. ఐడీ కార్డులు, డ్రైవింగ్లెసెన్సు, యాత్రకు అనుమతి పత్రాలు కచ్చితంగా ఉండాలని సూచించింది. హెచ్చరిక బోర్డులు ఉన్న చోట ఆగకూడదని, వాహనాలు నిలపకూడదని, ట్రెక్కింగ్షూలు మాత్రమే ధరించాలని చెప్పింది. కాలుష్యం, పర్యావరణం దెబ్బతినే విధంగా ఎలాంటి పనులు చేయకూడదని, ప్లాస్టిక్‌ను అస్సలు వినియోగించకూడదని…. చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించింది.
Discussion about this post