భద్రాచలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో హనుమాన్ దీక్షా మాలదారులతో ఆలయం కిటకిటలాడుతోంది. భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇరుముడిలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి మాలదారులు అధిక సంఖ్యలో వస్తున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరాముని దర్శించుకున్నారు భక్తులు.
Discussion about this post