ఐపీఎల్ 2024లో రసవత్తరంగా కొనసాగుతోంది. సగానికి పైగా టోర్నమెంట్ ముగిసింది. ఈ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌కు రెడీ అవుతుంది టీమిండియా. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మెగా ఈవెంట్లో భారత జట్టులో ఎవరికి చోటు లభిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును మే 1వ తేదీన ప్రకటించబోతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. దీనిపై ఇప్పటికే ఓ ఫార్మల్ మీటింగ్ సైతం ముగిసింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కేప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే దేశ రాజధానిలో సమావేశం అయ్యారు కూడా. వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టుపై ఓ నిర్ణయానికి వచ్చారు. మే 1వ తేదీన అధికారికంగా జట్టును ప్రకటించనున్నారు. గడువు సమీపించిన నేపథ్యంలో- భారత జట్టుపై అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. లెజెండరీలు, టీమిండియా మాజీ ప్లేయర్లు, స్పోర్ట్స్ కామెంటేటర్లు.. టీమిండియాలో ఆడబోయే ప్లేయర్ల గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్.. భారత జట్టు కూర్పుపై తన అంచనాలను వెల్లడించారు.
Discussion about this post