నీట్ ఎగ్జామ్ లో ఒక పేపర్‌కు బదులు మరో పేపర్.. ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం కొమరం భీమ్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్ టి ఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది దీనిపై ఎగ్జామ్ కండక్ట్ చేసిన సిటీ కోఆర్డినేటర్‌ను వివరణ కోరగా ఎస్బీఐ బ్యాంకు నుండి తీసుకురావలసిన పేపర్‌కు బదులు కెనరా బ్యాంకు నుండి తీసుకువచ్చిన పేపర్‌ను విద్యార్థులకు అందించడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు.. ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు వాళ్లకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు.
Credit: X
Discussion about this post