రాజస్థాన్ ఒక ప్రత్యేక ప్రాంతం. అక్కడి వాతావరణం.. ప్రశాంతత ఎక్కడా ఉండదు. అక్కడికి వెళ్లగానే కోటలు, చరిత్ర, యుద్దాలు అన్నీ గుర్తుకు వస్తాయి. వాస్తవానికి రాజస్థాన్ లోని ఇళ్లు,రాజప్రసాదాలు, కోటలు, జైఘర్ పోర్టు ఇవన్నీ మనకు రాజరిక రహస్యాలు, వెన్నుపోట్లు గురించి కథలు చెపుతున్నట్లు ఉంటాయి. రాజస్థాన్ అనేక ప్రముఖ యుద్దాలకు సజీవ సాక్ష్య్ంగా నిలిచింది. అందులో జైఘర్ పోర్టులోని గుప్తనిధులున్నాయని చెబుతారు.. వాటికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
జలోర్ యుద్దం 1310 నుంచి 1311 వరకు జరిగింది ఈ యుద్దంలోనే కన్హాడ్ డియోను అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఓడించాడు. మరో ఇద్దరు మొఘలాయిలు కూడా రాజస్థాన్ పై దండెత్తారు. మార్వార్ పైన అక్బర్ 1562 నుంచి 1583 వరకు, ఔరంగజేబు 1679 నుంచి 1707 వరకు దండెత్తారు. దీన్ని బట్టి మనకు తెలిసేదేమంటే ఇది వేడిప్రాంతమే కాదు… యుద్దాలు, నమ్మకద్రోహాలతో కూడా వేడెక్కిన ప్రాంతం. ఈ రాష్ట్రం అంతటా ఫోర్టులు, ప్యాలెస్ లు, హవేలీలు హారర్, సస్పెన్స్ కథలకు సాక్షిగా నిలిచింది. చరిత్రలో ఒక పేజీ తిరగేస్తే ఇన్నేళ్లు గడిచినా మానవాళి నైజం మాత్రం మారలేదు.. ఇంకా యుద్ధోన్మాదం తగ్గనూ లేదు.
గతం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్యాయాలు, అక్రమాలకు జైఘర్ ఫోర్ట్ సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఉచ్చస్థితి నుంచి దోపిడీకి గురైన వరకు ఇంకా చెప్పాలంటే 20వ శతాబ్దంలో కూడా చాలా చేతుత్లో ఆ సంపన్నమైన కోట అనేక ఆటుపోట్లను చూసింది. జైఘర్ కోటనే విక్టరీ కోటన అని కూడా అంటారు. 15 శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు కట్టారు. ఇది పర్యటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. దీనిని ఒక సారి సందర్శిస్తే అనేక విషయాలు మీకు తెలుస్తాయి. ఈ కోటను చూడగానే మధ్య యుగపు కట్టడాలు గుర్తుకొస్తాయి. దీనిలో నివసించిన రాజులు వారి ధనాగారాన్ని ఆమెర్ లో ఉంచి, దానిని ఆయుధాగారంగా చెప్పేవారు. 1726 లో సవాన్ జై సింగ్ ఈ ఫోర్టును కట్టించారు. ఇది సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కోట చుట్టూ అత్యంత ఎత్తులోని ప్రహారాలున్నాయి.
జైఘర్ ఫోర్టు ఎర్రని గోడలు మూడు కిలోమీటర్ల పొడవునా ఉంటాయి. వీటిని సాండ్ స్టోన్స్ తో కట్టారు. చక్రాలున్న ఫిరంగులు ప్రపంచంలో ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవు. ఫోర్టులోనే ఒక భాగంగా ఫిరంగులను నిర్మించారు. ఇవి ఎంతపెద్దవంటే ఏ యుద్దంలోనూ వాటిని ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. ఫిరంగుల వెనుక వాటర్ ట్యాంక్ ఉండేది అది కూడా చాలా పెద్దది. అక్కడ 60 లక్షల గ్యాలెన్ల నీటిని స్టోర్ చేసేవారు. అక్కడ వర్షపు నీటిని సంరక్షించే సదుపాయం కూడా ఉండేది. కచ్చవాహ రాజవంశం ధనాగారంగా దీనిని ఉపయోగించుకుందని చెబుతారు. ఈ ట్యాంకు కిందనే గదులున్నాయని వాటిని సంపదను దాచుకుంటానికి వినియోగించేవారని పెద్దలు చెబుతారు. మహారాజా మాన్ సింగ్ దాడి చేసినా.. ఈ సంపదను మాత్రం చేజిక్కించుకోలేక పోయాడు.
Discussion about this post