బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో ఐదో నిందితుడిని రాజస్థాన్లో అరెస్ట్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ మంగళవారం ఉదయం నిందితుడు మహ్మద్ చౌదరిని అరెస్టు చేసింది.
ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిగాయి. బైక్పై ఖాన్ ఇంటి ముందుకి వచ్చిన ముఠా గాలిలోకి మూడుసార్లు కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఇంటిపై కాల్పులు జరిపిన విక్కీ గుప్తా, సాగర్పాల్ను, వారికి ఆయుధాలు అప్పగించిన అనూజ్ తపన్, సోను సుభాష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఆధారంగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో అనూజ్ తపన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన నిందితుడిని వెంటనే ముంబైలోని జిటి ఆసుపత్రిలో చేర్చారు, అయితే పరిస్థితి విషమంగా ఉండగానే మరణించాడు.
Discussion about this post