క్రికెట్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా… ఏదో ఒకరోజు స్టార్ ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయం వస్తుంది. ఇది అభిమానులకు చాలా బాధ కలిగించవచ్చు. ఈ సారి IPL 2024 సీజన్ తర్వాత కూడా కొంతమంది ఆటగాళ్లు క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశముంది. వీరిని ఇక మనం IPL 2025లో చూడకపోవచ్చు.
లక్నో సూపర్ జెయింట్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వయసు ప్రస్తుతం 41 ఏళ్లు. ఈ సీజన్లో మిశ్రా పెద్దగా మ్యాచులు సైతం ఆడింది లేదు. దీంతో పాటు వయసు పెరగడం వల్ల వచ్చే ఫిట్నెస్ సమస్యల కారణంగా వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో మిశ్రా ఆడే అవకాశం చాలా తక్కువ. ఇదే జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. ప్రస్తుతం శర్మ వయసు 35 కాగా… ఇషాంత్ శర్మలో ఫిట్నెస్ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఫాస్ట్ బౌలర్ కూడా. 36 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలింగ్ చేయడం చాలా కష్టమైన పని. మరి ఇషాంత్ శర్మ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడడం కష్టంగానే ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి 42 ఏళ్లు కాగా… ఇప్పటికే ధోని తన రిటైర్మెంట్ పై హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. దీనికి తోడు ఆయన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. కాబట్టి మిస్టర్ కూల్ కు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా వయసు 39 ఏళ్లు పైబడడంతో పాటు ఇప్పటికే టీం ఇండియాకు సైతం దూరమైన సాహా వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు. దినేష్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ అండ్ బ్యాటర్. మైదానంలో డీకే చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు కానీ అతని వయస్సు 38. కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్య్టా ఏ జట్టు కూడా అతనిపై ఆసక్తి చూపించకపోవచ్చు.
Discussion about this post