టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భూమికి సంబంధించిన వివాదం ఒకటి బయటకు వచ్చింది. దానిపై ఆయన ఫ్యాన్స్ స్పందించారనే వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. జూ.ఎన్టీఆర్ ఎప్పుడు న్యాయంగానే ఉంటారని.. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులతోనే చాలా జాగ్రత్తగా కొనుగోలు చేశాడని… ఇప్పుడు ఆయన ఇళ్లు కట్టడం ఆపేయడం ఎంతో బాధాకరమని ఇంకొ0దరు అంటున్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా సీరియస్‌గా కూడా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ స్థలం ఆయనకు చెందకుండా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటున్నారు కొందరు. మరికొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అది ఆయన పర్సనల్.. కాబట్టి దాని జోలికి వెళ్లకపోవడం బెటరంటున్నారట… ఇక అభిమానుల స్పందనలపై జూనియర్ ఏమనుకుంటున్నారనే విషయం తెలియాలంటే కాస్త వెయింటింగ్ చేయాల్సిందే… ఎప్పుడూ ఫ్యాన్స్ చాలా సున్నితంగా ఉండాలని చెప్పే జూనియర్… ఈ సారి ఏం చెబుతాడో వినాలి… ఫ్యాన్స్ బాగోగులు కోరుకునే అతి కొద్ది మంది హీరోల్లో జూనియర్ కూడా ఒకరు… అభిమానులు సంయమనం పాటించాలనే చెబుతారని కొందరు చర్చించుకుంటున్నారు.
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. వివరాల్లోకి వెళ్తే… జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 681 చదరపు గజాల స్థలం విషయంలో వివాదం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ చెపుతున్న వివరాల ప్రకారం… 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే, ఆ భూమిని ఎన్టీఆర్ కు అమ్మిన వ్యక్తులు 1996లోనే దాన్ని తమ వద్ద తనఖా పెట్టి రుణం పొందారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై పోలీస్ స్టేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో, ఆమెపై కేసు నమోదయింది. మరోవైపు, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో… తమకు సమయం కావాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్ట్ చేయాలని ఎన్టీఆర్ న్యాయవాది కోరగా ధర్మాసనం తిరస్కరించింది. జూన్ 6కు తదుపరి విచారణను వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది.
Discussion about this post