పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మూడు పార్టీలకు చెందిన అభ్యర్దులు ఒకే పార్టీ నుంచి రావడంతో వరంగల్ లో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా కడియం కావ్యకు టికెట్ కేటాయించినప్పటికీ… టికెట్ నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరగా…ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటికే బిఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ ఆశించగా చివరి నిమిషంలో కావ్య పేరు తెరపైకి రావడంతో వరంగల్ కాంగ్రెస్ లో అసమ్మతి రాజుకుంది. అసమ్మతి నేతలను, కార్యకర్తలను కలుపుకుని పోతానని…ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్తానంటున్న ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.
Discussion about this post