కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో థగ్ లైఫ్ చిత్రం భారీగా రూపొందుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాను మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఎన్నికల తర్వాత షూటింగ్ మళ్ళీ మొదలు కావచ్చుఅంటున్నారు.
Discussion about this post