నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రజల మధ్యలోనే ఉంటూ… ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలని… ప్రజల గొంతుకనై పార్లమెంటులో ప్రశ్నించాలని భావించి ఇండిపెండెట్ అభ్యర్థిగా కరీంనగర్ నుండి మానస రెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియకు కావలసిన డిపాజిట్ సొమ్మును… గడప గడపకు పది రూపాయల చొప్పున సేకరించి, ఆ డబ్బులతోనే 25000 వేల రూపాయలను డిపాజిట్ రూపంలో కట్టారు. నామినేషన్ వేయడానికి 10 రూపాయల నాణేలు నెత్తిపై బుట్టలో తీసుకుని వెళ్ళడంతో ఆమె ప్రజాస్వామ్యంపై తనకు ఉన్న విశ్వాసాన్ని అందరికి గుర్తుచేసింది. విద్యావంతులను, సామాన్య ప్రజలను ఆలోచింప చేసే మానసరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలకు సైతం కనువిప్పు కలిగేలా చేసింది.
పేరాల మానస అంటే తెలియని వారు ఉండరు. అతి చిన్న వయసులోనే పైపు హౌస్ నిర్మాణం చేపట్టి పేదవాని సొంత ఇంటి కల నెరవేర్చింది. యువతి యువకులకు రోల్ మోడల్ గా నిలిచింది.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం, బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన మానస రెడ్డి చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయింది. వ్యయసాయంతో వచ్చిన అప్పుల భాదతో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకోగా … కుటుంబ భారం వాళ్ల అమ్మ గారి మీద పడింది. చదివించే ఆర్ధిక స్తోమత లేకపోవడంతో.. కష్టపడి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫ్రీగా సీటు సంపాదించుకొని కష్టాలను చూస్తూ పెరిగింది. ఈ కష్టాలను కేవలం ఒక ఉన్నత విద్యతో మాత్రమే అధిగమించగలనని భావించిన మానస ప్రతి తరగతిలో స్కూల్ ఫస్ట్ వస్తూ, తోటి విద్యార్థినులకు చదువు విలువ, సమయం విలువను తెలియజేస్తూ, అప్పటికే విద్యలేక, సమాజం పట్ల అవగాహన లేనటువంటి మైనర్ బాలికలకు జరిపిస్తున్న బాల్య వివాహాలను అడ్డుకొంది. చిన్ననాటి నుండే మానస రెడ్డి ప్రతిభను, సేవా ధృక్పథాలను గుర్తించి వాయిస్ ఫర్ గర్ల్స్ అనే ఇంటర్నేషనల్ సంస్థ ఆమెకు తోడుగా నిలుస్తూ, వారితో కలిసి పని చేసే సదవకాశాన్ని కల్పించడంతో ఆమె సేవలను మరెంతో మంది బాలికలకు సమాజం పట్ల పూర్తి అవగాహన కల్పించేలా చేసింది.
300 మంది విద్యార్థినిలకు క్లాస్ ల రూపంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయించింది. చిన్ననాటి నుండి ఆమె చుట్టు జరిగే రైతు ఆత్మహత్యలు, నిరుపేద కుటుంబాలు వారి దయనీయ పరిస్థితులను చూసి, మనస హృదయం చలించిపోవడంతో… వీటన్నింటిని చూసి అప్పుడే తను ఒక గట్టి దృఢ సంకల్పం తీసుకుంది.. ఒక ఉన్నతమైన చదువు, స్థాయితో మాత్రమే రైతులకి, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకి, వారు ఎదుర్కునే సమస్యలకి న్యాయం చేయగలనని విశ్వసిస్తూ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించింది. ఇంజనీరింగ్ చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ.. కుటుంబానికి, ఆమె చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వృద్ధులకి, అనాధపిల్లలకి ఎంతో కొంత సహాయం చేస్తూ బాసటగా నిలిచారు. వీటి నుండి వచ్చిన ఆలోచనలలో భాగంగా.. నిరుపేద, నిరాశ్రయులకి అతి తక్కువ వ్యయంతో తక్కువ స్థలంలో గృహ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఓ పడ్ హౌస్ అనే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని గుర్తించి ప్రశంసలతో పాటు, తదుపరి కార్యచరణకై నాంది పలికారు..దీనిని గుర్తించిన అల్ట్రా టెక్ అనే కంపెనీ తెలంగాణ యంగ్ ఇంజనీర్ అవార్డు, బెస్ట్ కాంక్రీట్ ఇంజనీర్ అవార్డుని ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా ఆమె ప్రజలకి సేవ చేయాలన్న ధృక్పథంతో సర్వీస్ సెక్టార్లో ఒక గొప్ప స్థాయిలో ఉంటే, ఇంకా ఎక్కువ మందికి సాయం చేయగలనని విశ్వసించి యుపిఎస్సి ప్రిపేర్ కూడా అయ్యారు.
Discussion about this post