ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడ మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ…. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు రాదని, సొంత పార్టీ గురించి నెగిటివ్‌గా మాట్లాడారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులు ఖంగుతిన్నారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ రెండు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ లభించలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల… పార్టీ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ… కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఆమె నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. కడప లోక్ సభ నుంచి బరిలోకి దిగిన షర్మిల.. తన విజయం ఖాయం అనే ధీమాతో ఉంది. ఏపీలో ఒకటి, రెండు అసెంబ్లీ సీట్లు గెలుస్తామని అక్కడి స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంతలో తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేసింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్, షర్మిలతో మంచి రిలేషన్ షిప్ ఉంది. సమయం దొరికినప్పడు వారిని కలుస్తూ ఉంటారు. ఇద్దరితో మంచి ఫ్రెండ్ షిఫ్ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మంత్రి కామెంట్లపై హై కమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి…
Discussion about this post