అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి దగ్గుబాటి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. అందులో భాగంగా ఈ రోజు నగరంలోని మేదరి కాలనీలో దాదాపుగా 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకట ప్రసాద్ మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోజు రోజుకి టీడీపీ వైపు ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గంలో తప్పకుండా టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరంతరం తన వెంటే ఉంటూ.. గెలుపు కోసం శ్రమిస్తున్నారన్నారు. వారందరికీ న్యాయం చేస్తానన్నారు దగ్గుబాటి వెంకట ప్రసాద్. అనంతపురం నగరంలోని రాంనగర్ నుండి భారీ ర్యాలీతో స్థానిక ఆర్.డీ.ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తామని, నామినేషన్ కార్యక్రమానికి నగరంలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు మద్దతు తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. నామినేషన్ కార్యక్రమంతోనే వైసీపీ నాయకులకు దడ పుడుతుందన్నారు, భారీ మెజారిటీతో గెలుస్తామని దగ్గుబాటి తెలిపారు..
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post