ధర్మవరం మొత్తం కూటమీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది. సత్య కుమార్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు కూటమి నేతలు.
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివానగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. భారీ జనసంద్రోహంతో నామినేషన్ వేశారు సత్యకుమార్. ర్యాలీగా శివానగర్ శివాలయం దగ్గర నుంచి దిమ్మెల సెంటర్, తేరు బజార్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఆశేష జనవాహిని మధ్యన పసుపు జెండాలు, కమలం జెండాలు,టీడీపి, జనసేన జెండాలతో.. సత్య కుమార్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ రెవెన్యూ డివిజన్ కార్యాలయాని వెళ్లారు. అక్కడ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్. సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి విజయ్ కుమార్ సింగ్, పరిటాల శ్రీరామ్, చిలకo మధుసూదన్ రెడ్డి, సినీ హీరో సాయికుమార్, బిజెపి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, టిడిపి కార్యకర్తలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post