అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే భయంకరమైన ఉద్దేశంతో బీజేపీ ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షులు ఎంకె స్టాలిన్ విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్టాలిన్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. బీజేపీ తన తిరోగమన వాదంతో దేశాన్ని తీవ్రమైన ఆకలి వైపునకు, రెండు శతాబ్దాల వెనక్కి తీసుకుని వెళ్లిందని ఈ పోస్టులో ఆరోపించారు. భారత దేశం తన చరిత్రలోనే అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటుందని అన్నారు. అంబేడ్కర్ నవయుగ బుద్దుడుగా అభివర్ణించారు. నిజమైన సమసమాజాన్ని సాధించడానికి అంబేద్కర్ అంతులేని జ్ఞానం, స్ఫూరిని మనం అనుసరించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
Discussion about this post